దేశంలో ఆరు లక్షలు దాటిన కరోనా కేసులు

  • గత 24 గంటల్లో దేశంలో 19,148 మందికి కరోనా 
  • మొత్తం కేసులు 6,04,641
  • మృతుల సంఖ్య 17,834
  •  2,26,947 మందికి ఆసుపత్రుల్లో చికిత్స
దేశంలో కొవిడ్‌-19 కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో దేశంలో 19,148 మందికి కొత్తగా కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో 434 మంది కరోనా కారణంగా మరణించారు.
     
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 6,04,641కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 17,834కి పెరిగింది. 2,26,947 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,59,860 మంది కోలుకున్నారు. 

కాగా, నిన్నటి వరకు దేశంలో మొత్తం 90,56,173 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 2,29,588 శాంపిళ్లను పరీక్షించినట్లు వివరించింది.  
 
దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 1,80,298 కరోనా కేసులు నమోదుకాగా, ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 8,053 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులో ఇప్పటివరకు 94,049 కరోనా కేసులు నమోదు కాగా, 1,264 మంది మృతి చెందారు. ఢిల్లీలో  89,802 కరోనా కేసులు నమోదు కాగా,  2,803  మంది ప్రాణాలు కోల్పోయారు.



More Telugu News