తండ్రీకొడుకుల లాకప్ మరణంపై రజనీకాంత్ ఆవేదన
- తండ్రీకొడుకులను అరెస్ట్ చేసిన పోలీసులు
- రెండు రోజుల వ్యవధిలో ఇద్దరూ మృతి
- ఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలన్న రజనీకాంత్
తమిళనాడులోని తూత్తుకుడిలో తండ్రీకొడుకులు చనిపోయిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. మొబైల్ షాపు ఓనర్లైన వీరిని లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి షాపు తెరిచారంటూ పోలీసులు అరెస్టు చేశారు. లాకప్ లో ఉన్న వీరు రెండు రోజుల తేడాతో మృతి చెందారు. వీరి మృతిపై స్థానికులు ఆందోళన కార్యక్రమాలను చేపట్టారు. పోలీసులే హత్య చేశారంటూ ఆందోళన చేపట్టారు.
ఈ ఘటనపై మద్రాస్ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. కేసును విచారించిన హైకోర్టు... ఈ కేసును సీబీఐ స్వీకరించేంత వరకు సీఐడీకి అప్పగించాలని ఆదేశించింది. ఈ ఘటనపై సినీ నటుడు రజనీకాంత్ స్పందించారు. కొందరు పోలీసులు ప్రవర్తించిన తీరు తనకు ఆశ్చర్యకరంగా ఉందని చెప్పారు. ఈ ఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.