పశ్చిమబెంగాల్ బీజేపీ చీఫ్ పై దాడి.. ధ్వంసమైన కారు!
- టీఎంసీ మద్దతుదారులు దాడి చేశారన్న దిలీప్ ఘోష్
- సెక్యూరిటీ సిబ్బందిపై కూడా దాడి
- ప్రభుత్వంపై మండిపడ్డ దిలీప్
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి దిలీప్ ఘోష్ పై కొందరు వ్యక్తులు దాడికి తెగబడ్డారు. ఈ ఉదయం ఆయనపై దాడి జరిగింది. ఈ దాడిలో ఆయన వాహనం ధ్వంసమయింది. ఈ సందర్భంగా దిలీప్ ఘోష్ మీడియాతో మాట్లాడుతూ టీఎంసీ మద్దతుదారులే తనపై దాడి చేశారని ఆరోపించారు. తనను కాపాడేందుకు యత్నించిన తన భద్రతా సిబ్బందిపై కూడా దాడి చేశారని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎంత దారుణంగా ఉన్నాయో ఈ ఘటనతో అర్థమవుతోందని చెప్పారు.
ఈ ఉదయం తమ పార్టీ కార్యకర్తలను కోచ్ పుకుర్ గ్రామంలోని ఓ టీ స్టాల్ వద్ద తాను కలవాల్సి ఉందని... తాను అక్కడకు చేరుకోక ముందే టీఎంసీ కార్యకర్తలు తనను అడ్డుకున్నారని దిలీప్ ఘోష్ తెలిపారు. తనపై చేయి చేసుకున్నారని... తన సెక్యూరిటీ గార్డ్ పై కూడా దాడి చేశారని చెప్పారు. తన పర్యటన గురించి పోలీసులకు ముందే సమాచారమిచ్చినప్పటికీ... వారు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని తెలిపారు.