ఆంధ్రప్రదేశ్‌లో 15,000 దాటిన కరోనా కేసులు
- గత 24 గంటల్లో 28,239 శాంపిళ్ల పరీక్ష
- మరో 657 మందికి కరోనా నిర్ధారణ
- వారిలో 611 మంది ఏపీ వాసులు
- ఆసుపత్రుల్లో 7,033 మంది ఏపీ వాసులకు చికిత్స
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో 28,239 శాంపిళ్లను పరీక్షించగా మరో 657 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. వారిలో 611 మంది ఏపీ వాసులు ఉన్నారని వివరించింది. 24 గంటల్లో 342 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 12,813. ఏపీలో చికిత్స తీసుకుంటున్న ఇతర రాష్ట్రాలు, దేశాల వారితో కలిపి మొత్తం 15,252 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రుల్లో కరోనాకు 7,033 మంది ఏపీ వాసులు చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 5,587 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 193కి చేరింది.
ఏపీలో కరోనా కేసుల పూర్తి వివరాలు..