చైనాపై నా కోపం అంతకంతకు పెరుగుతోంది: డొనాల్డ్ ట్రంప్

  • అమెరికాలో రోజురోజుకీ పెరిగిపోతోన్న కరోనా తీవ్రత
  • అదుపు చేయలేకపోతున్నామన్న వైద్యులు
  • చైనాపై ట్రంప్ మరోసారి ఫైర్
  • అన్ని దేశాలకు ఈ వైరస్‌ ఎంతో నష్టాన్ని తీసుకొచ్చింది
అమెరికాలో కరోనా వైరస్‌ తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతోంది. కరోనా వ్యాప్తిని అదుపు చేయలేక అగ్రరాజ్యం నానా సమస్యలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో కరోనా పుట్టినిల్లు చైనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా విజృంభణ ప్రపంచవ్యాప్తంగా అధికమైందన్నారు.

అమెరికాతో పాటు ప్రపంచంలోని అన్ని దేశాలకు ఈ వైరస్‌ ఎంతో నష్టాన్ని తీసుకొచ్చిందని ట్రంప్ చెప్పారు. ప్రస్తుతం చైనా మీద తనకున్న కోపం అంతకంతకు పెరుగుతోందని చెప్పారు. కాగా, అమెరికాలో కరోనా వ్యాప్తిని అదుపు చేసే పరిస్థితులు లేకపోవడంతో అక్కడి వైద్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా నియంత్రణ సాధించలేమని అమెరికా‌ వైద్యులు ట్రంప్‌కు తెలిపారు.

ఈ నేపథ్యంలోనే చైనాపై ట్రంప్ మరోసారి విరుచుకుపడ్డారు. తన దేశంలో కరోనాను వూహాన్ దాటకుండా చేయగలిగిన చైనా, దేశాన్ని మాత్రం దాటించి ప్రపంచానికి ఎలా వ్యాప్తి చేసిందని ట్రంప్ మొదటి నుంచి ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రదర్శించిన తీరు కూడా సరికాదని ఆయన అంటున్నారు.


More Telugu News