భారత్‌లో గత ఐదు దశాబ్దాల్లో 4.58 కోట్ల మంది మహిళల అదృశ్యం.. నివ్వెర పరుస్తున్న ఐరాస నివేదిక
- నివేదిక విడుదల చేసిన ఐరాస జనాభా నిధి
- మహిళలు అత్యధికంగా అదృశ్యమవుతున్న దేశాల్లో చైనాది టాప్ ప్లేస్
- పేదరిక నిర్మూలన విషయంలో భారత్‌ను శ్లాఘించిన ఐరాస
‘ప్రపంచ జనాభా-2020’పై ఐక్యరాజ్య సమితి జనాభా నిధి (యూఎన్ఎఫ్‌పీఏ) నిన్న విడుదల చేసిన నివేదిక భారత్‌ను నివ్వెర పరుస్తోంది. గత 50 ఏళ్లలో దేశంలో ఏకంగా 4.58 కోట్ల మంది మహిళలు అదృశ్యమయ్యారని ఐరాస ఆ నివేదికలో పేర్కొంది. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా 14.26 కోట్ల మంది గల్లంతయ్యారని వివరించింది. 1970 లెక్కల్లో ఇది 6 కోట్లగా ఉండగా, తాజాగా అది రెట్టింపునకు పైనే ఉండడం ఆందోళన కలిగిస్తోంది.
ఇక, మహిళలు అత్యధికంగా అదృశ్యమవుతున్న దేశాల జాబితాలో చైనా తొలి స్థానంలో ఉండగా, భారతదేశం ఆ తర్వాతి స్థానంలో ఉంది. చైనాలో 7.23 కోట్ల మంది మహిళలు గల్లంతు కాగా, 2013-17 మధ్య భారత్‌లో ఏకంగా 4.6 లక్షల మంది బాలికలు అదృశ్యమైనట్టు నివేదిక పేర్కొంది. కాగా, దేశంలో పేదరికాన్ని నిర్మూలించేందుకు భారత్ అనుసరిస్తున్న తీరును ఐరాస కొనియాడింది. పేదరిక నిర్మూలనలో భారత్ విజయం ప్రపంచానికే విజయమని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు ముహమ్మద్ బందే ప్రశంసించారు.