స్మార్ట్ ఫోన్ లో టిక్ టాక్ ఉన్నా... ఇండియాలో ఇక పనిచేయదు!

  • నిలిచిపోయిన యాప్ సేవలు
  • ఓపెన్ చేస్తే నెట్ వర్క్ ఎర్రర్
  • మొత్తం 59 యాప్ లపై కేంద్రం నిషేధం
ఇకపై మీ స్మార్ట్ ఫోన్లో టిక్ టాక్ యాప్ ఉన్నా, అది పని చేయదు. కేంద్రం 59 చైనా యాప్ లపై నిషేధం విధించిన తరువాత కూడా పనిచేస్తూ వచ్చిన టిక్ టాక్ సహా పలు యాప్ లు ఇప్పుడు మూగబోయాయి. మొబైల్ ఫోన్లు, డెస్క్ టాప్ వర్షన్లలో యాప్ సేవలు ఆగిపోయాయి. దీంతో దేశవ్యాప్తంగా టిక్ టాక్ పూర్తిగా ఆఫ్ లైన్ లోకి వెళ్లినట్లయింది. ఈ యాప్ ను ఓపెన్ చేస్తే నెట్ వర్క్ ఎర్రర్ అన్న మెసేజ్ కనిపిస్తోంది. కాగా, తాము నిబంధనలన్నీ పాటిస్తున్నామని, కస్టమర్ల వివరాలను చైనా సహా ఏ ఇతర దేశంతోనూ పంచుకోలేదని టిక్ టాక్ ఇండియా హెడ్ నిఖిల్ గాంధీ నిన్న వెల్లడించిన సంగతి తెలిసిందే.


More Telugu News