ప్రకాశం జిల్లాను భయపెడుతున్న కరోనా కేసులు
- తాజాగా మరో 33 మందికి కరోనా
- 663కి పెరిగిన మొత్తం కేసుల సంఖ్య
- 80,641 మంది నుంచి నమూనాల సేకరణ
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లావాసులు ఇప్పుడు కరోనా భయంతో వణికిపోతున్నారు. జిల్లాలో తాజాగా మరో 33 మంది కరోనా బాధితులుగా మారారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 663కు పెరిగింది. అలాగే, ఇప్పటి వరకు 11 మంది కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
ఇక, అత్యధికంగా ఒంగోలులో 14, మార్కాపురంలో 12 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో ఇప్పటి వరకు 80,641 మంది నుంచి నమూనాలు సేకరించగా, 76,153 మంది ఫలితాలు నెగటివ్‌గా వచ్చినట్టు వైద్యాధికారులు తెలిపారు. 3,867 మంది ఫలితాలు రావాల్సి ఉంది. జిల్లాలో 525 మంది క్వారంటైన్‌లో ఉండగా, 262 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 401 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు.