యూరోపియన్ యూనియన్ కీలక నిర్ణయం.. పాక్ విమానాలకు ఆరు నెలలపాటు చెక్!

  • నేటి నుంచి అమల్లోకి ఈయూ నిర్ణయం
  • పీఐఏ విమానాలకు ఇక యూరోపియన్ దేశాల్లోకి నో ఎంట్రీ
  • పైలట్లు అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో నిర్ణయం
పాకిస్థాన్ పైలట్లు అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌ (పీఐఏ) కు చెందిన విమానాలపై ఆరు నెలలపాటు నిషేధం విధించింది.

నేటి నుంచి అమల్లోకి రానున్న ఈ నిషేధం డిసెంబరు 31 వరకు అమల్లో ఉంటుంది. 860 మంది పాక్ పైలట్లలో 262 మంది పైలట్ పరీక్షల్లో అవకతవకలకు పాల్పడినట్టు బయటపడింది. ఇటీవల పాక్‌లో జరిగిన విమాన ప్రమాదం అనంతరం ఈ విషయం బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే యూరోపియన్ యూనియన్ సభ్య దేశాల గగనతలంపై పాక్ విమానాలు ప్రయాణించకుండా తాజా నిర్ణయాన్ని ప్రకటించింది.


More Telugu News