రఘురామకృష్ణరాజుపై అనర్హత పిటిషన్?.. చర్యలకు సిద్ధమవుతున్న వైసీపీ హైకమాండ్!
- జగన్ ను పొగుడుతూనే.. పార్టీ నేతలపై విమర్శలు గుప్పిస్తున్న రఘురాజు
- పార్టీ షోకాజ్ నోటీసును చాలా లైట్ గా తీసుకున్న వైనం
- లోక్ సభ స్పీకర్ కు అనర్హత పిటిషన్ సమర్పించే యోచనలో హైకమాండ్
పార్టీపై ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్న ఎంపీ రఘురామకృష్ణరాజుపై వైసీపీ హైకమాండ్ చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. పార్టీ ఇచ్చిన షోకాజ్ నోటీసుపై ఆయన చేసిన రచ్చపై అధిష్ఠానం ఆగ్రహంగా ఉంది. సొంత పార్టీ ఎమ్మెల్యేలనే అవినీతిపరులంటూ వ్యాఖ్యలు చేయడం పార్టీ నేతలకు మింగుడు పడటం లేదు. పార్టీలో నెంబర్ 2గా ఉంటున్న విజయసాయిరెడ్డిపై ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీ ప్రతిష్టను మంటగలిపే విధంగా ఉన్నాయి. ఓవైపు ముఖ్యమంత్రిని పొగుడుతూనే... పార్టీ ఇమేజ్ ను డ్యామేజ్ చేసే విధంగా ప్రవర్తిస్తున్నారంటూ నేతలు మండిపడుతున్నారు.
ఈ నేపథ్యంలో ఇంకా ఉపేక్షిస్తే పార్టీకి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందని వైసీపీ హైకమాండ్ భావిస్తోంది. దీంతో ఆయనపై చర్యలకు సమాయత్తమవుతోంది. రఘురాజుపై లోక్ సభ స్పీకర్ కు అనర్హత పిటిషన్ ను సమర్పించే యోచనలో వున్నట్టు తెలుస్తోంది.