నెల్లూరు ఘటనపై ఏపీ డీజీపీకి లేఖ రాసిన జాతీయ మహిళా కమిషన్
- ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన జాతీయ మహిళా కమిషన్
- బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారంటూ డీజీపీకి లేఖ
- పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలంటూ ఆదేశం
ఏపీలో దివ్యాంగురాలైన ఓ మహిళా ఉద్యోగిపై టూరిజం విభాగం డిప్యూటీ మేనేజర్ అత్యంత హేయమైన రీతిలో దాడి చేయడం అన్ని వర్గాలను ఆగ్రహానికి గురిచేసింది. నెల్లూరులో జరిగిన ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ ఘటనకు కారకులైన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలంటూ ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ను ఆదేశించింది. ఈ మేరకు లేఖ రాసింది. వీలైనంత త్వరగా పూర్తి వివరాలతో తమకు నివేదిక అందించాలని స్పష్టం చేసింది. ఓ దివ్యాంగురాలిపై అంత దారుణంగా హింసకు పాల్పడడం తమను నిర్ఘాంతపోయేలా చేసిందని కమిషన్ తన లేఖలో పేర్కొంది.