బీజేపీకి మద్దతు పలికిన మాయావతిపై ప్రియాంకా గాంధీ ఫైర్

  • చైనా వివాదంపై బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మద్దతిస్తామన్న మాయావతి
  • బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆరోపణలు చేసుకోవడం దేశానికి మంచిది కాదని వ్యాఖ్య
  • బీజేపీ తీరుతో భారత్ భూభాగాన్ని కోల్పోతుందని ప్రియాంక ఫైర్
చైనా వైఖరితో సరిహద్దుల వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి తలెత్తిన సంగతి తెలిసిందే. రెండు అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలు, అణ్వాయుధ దేశాల మధ్య తలెత్తిన ఈ వివాదం ఎంత దూరం వెళ్తుందోనని ప్రపంచ దేశాలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఈ తరుణంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి కీలక ప్రకటన చేశారు. ఇండియా-చైనా బోర్డర్ విషయంలో బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా బహుజన సమాజ్‌ పార్టీ మద్దతుగా నిలుస్తుందని ఆమె ప్రకటించారు. ఈ అంశంపై బీజేపీ-కాంగ్రెస్ పార్టీలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడం దేశ ప్రయోజనాలకు మంచిది కాదని వ్యాఖ్యానించారు.

మాయావతి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ మండిపడ్డారు. బీజేపీ వ్యవహరిస్తున్న తీరుతో భారత్ తన భూభాగాన్ని కోల్పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఎలా పలుకుతారని మండిపడ్డారు.


More Telugu News