యూపీలో 'అందమైన పాము'... ఎంతో అరుదైనదంటున్న నిపుణులు

  • దుధ్వా నేషనల్ పార్క్ లో పామును చూసిన సిబ్బంది
  • సోషల్ మీడియాలో పాము ఫొటోకి అద్భుతమైన స్పందన
  • 1936లో తొలిసారిగా కనిపించిన పాము
ఉత్తరప్రదేశ్ లోని దుధ్వా నేషనల్ పార్క్ లో ఎంతో అరుదైన పామును గుర్తించారు. లక్షింపూర్ ఖేరీలో ఉన్న ఈ అభయారణ్యంలో రెండ్రోజుల క్రితం ఈ పాము అటవీ సిబ్బంది కంటబడింది. మెరిసిపోతున్న శరీరంతో, ఎంతో అందంగా ఉన్న ఆ పామును ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా, అద్భుతమైన స్పందన వచ్చింది. కాగా, ఇది ఎంతో అరుదైన పాము అని, దీన్ని 'రెడ్ కోరల్ కుక్రీ' అంటారని వన్యప్రాణి నిపుణులు తెలిపారు. దీని శాస్త్రీయనామం 'ఒలిగోడోన్ ఖెరినెన్సిస్'. ఈ తరహా పామును ఇదే ప్రాంతంలో 1936లో తొలిసారిగా చూశారు. తాజాగా, వర్షం కురిసిన అనంతరం సిబ్బంది నివాస గృహాల వద్ద ఈ పాము దర్శనమిచ్చింది.


More Telugu News