వచ్చే నెల మరో యాప్ ను ప్రవేశపెడుతున్న ఏపీఎస్ ఆర్టీసీ
- ఇప్పటికే టికెట్ బుకింగుల కోసం అందుబాటులో ఉన్న యాప్
- తాజాగా సిటీ బస్సుల్లో టికెట్ల కోసం రాబోతున్న కొత్త యాప్
- తొలి దశలో విజయవాడ, వైజాగ్ సిటీ బస్సులకు యాప్ వినియోగం
ఏపీఎస్ ఆర్టీసీ మరో యాప్ ను తీసుకురాబోతోంది. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకోవడానికి ఆర్టీసీకి ఒక యాప్ ఉంది. తాజాగా సిటీ బస్సుల కోసం కొత్త యాప్ ను తీసుకురాబోతోంది. సిటీ బస్సుల్లో టికెట్ తీసుకోవడాన్ని ఆన్ లైన్ లోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఆర్టీసీ అధికారులు యాప్ ను తయారు చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన పేరు ఇంకా ఖరారు కానప్పటికీ... 'ప్రథమ్ యాప్' అని అనుకుంటున్నారు.
వచ్చే నెలలో ఈ యాప్ అందుబాటులోకి రానుంది. తొలి దశలో విజయవాడ, విశాఖ సిటీ బస్సుల్లో టికెట్ల కొనుగోలుకు ఈ యాప్ ను వాడనున్నారు. పల్లె వెలుగు బస్సులకు కూడా ఈ యాప్ ను వాడాలని నిర్ణయించారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ యాప్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.