టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కు షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం
- అమర్ రాజా ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ కు 253 ఎకరాలను కేటాయించిన గత ప్రభుత్వం
- ఇప్పటి వరకు ఎలాంటి నిర్మాణాలు జరగలేదన్న ప్రస్తుత ప్రభుత్వం
- భూములను వెనక్కి తీసుకుంటున్నట్టు ఉత్తర్వులు జారీ
తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ కు ఏపీ ప్రభుత్వం షాకిచ్చింది. ఆయన సంస్థ అమర్ రాజా ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ కు గత ప్రభుత్వం కేటాయించిన 253 ఎకరాల భూమిని వెనక్కి తీసుకుంటూ ఉత్తర్వులను జారీ చేసింది. ఏపీఐఐసీ కింద గత ప్రభుత్వం ఈ భూమిని కేటాయించింది. చిత్తూరు జిల్లాలోని బంగారుపాలెం, నునిండ్లపల్లి, కొత్తపల్లిలో ఈ భూములను కేటాయించింది. అయితే, ఆ భూమిలో ఇప్పటి వరకు ఎలాంటి నిర్మాణాలు జరగకపోవడంతో... వాటిని వెనక్కి తీసుకుంటున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. దీనిపై గల్లా జయదేవ్ ఇంకా స్పందించాల్సి ఉంది.