మోదీ 'ఉచిత రేషన్' ప్రకటనపై మమతాబెనర్జీ విసుర్లు

  • నవంబర్ వరకు 80 కోట్ల మందికి ఉచిత రేషన్ అందిస్తున్నట్టు మోదీ ప్రకటన
  • మేము వచ్చే ఏడాది జూన్ వరకు అందించబోతున్నామన్న మమత
  • మా సరుకులు మరింత నాణ్యంగా ఉంటాయంటూ సెటైర్
నవంబర్ వరకు దేశంలోని 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ సరుకులు అందిస్తామని ప్రధాని మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని కోసం రూ. 90 వేల కోట్లను ఖర్చు చేయబోతున్నట్టు తెలిపారు. మోదీ చేసిన ప్రకటనపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సెటైర్లు వేశారు.

నవంబర్ వరకే ఫ్రీ రేషన్ ఇస్తున్నట్టు మోదీ ప్రకటించారని... వచ్చే ఏడాది జూన్ వరకు తాము రేషన్ సరుకులను ఉచితంగా ఇవ్వబోతున్నామని మమత చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సరుకుల క్వాలిటీ కంటే తాము ఇచ్చే సరుకుల నాణ్యత మెరుగ్గా ఉందని అన్నారు. పశ్చిమబెంగాల్ లో కేవలం 60 శాతం మంది ప్రజలకు మాత్రమే కేంద్ర రేషన్ అందుతోందని చెప్పారు.


More Telugu News