హైదరాబాద్, జీహెచ్ఎంసీ పరిధిలో ఉచితంగా కరోనా పరీక్షలు చేసే ప్రాంతాలు ఇవే!

  • జీహెచ్ఎంసీ పరిధిలో 50 వేల పరీక్షలకు సీఎం ఆదేశం
  • ఇప్పటివరకు 36 వేల శాంపిల్స్ సేకరణ
  • తాజాగా మరో విడత పరీక్షలు
హైదరాబాద్, చుట్టు పక్కల పలు నియోజకవర్గాల్లో 10 రోజుల్లో 50 వేల కరోనా పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో, తాజాగా మరో విడత పరీక్షలు షురూ అయ్యాయి.

ఈ నెల 16 నుంచి 9 రోజుల పాటు పరీక్షలు నిర్వహించి 36 వేల శాంపిల్స్ సేకరించారు. అయితే ఆ శాంపిళ్లను పరీక్షించేందుకు సమయం పడుతుండడంతో ఇన్నాళ్లూ, కొత్త శాంపిల్స్ సేకరణను నిలిపివేశారు. అయితే ఇప్పుడు అన్ని టెస్టుల్లోనూ రిజల్ట్స్ వచ్చేయడంతో, కొత్త శాంపిళ్ల సేకరణకు మార్గం సుగమం అయింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఉచితంగా కరోనా పరీక్షలను పునఃప్రారంభించారు.

ఉచిత కరోనా పరీక్ష కేంద్రాలు ఇవే...

  • సరోజిని దేవి కంటి ఆసుపత్రి (రోజుకు 250 శాంపిల్స్ సేకరణ)
  • నేచుర్ క్యూర్ ఆసుపత్రి
  • ఆయుర్వేదిక్ ఆసుపత్రి
  • చార్మినార్ నిజామియా ఆసుపత్రి
  • రంగారెడ్డి జిల్లా కొండాపూర్ ఏరియా ఆసుపత్రి (రోజుకు 150 శాంపిల్స్ సేకరణ)
  • వనస్థలిపురం ఏరియా ఆసుపత్రి
  • బాలాపూర్ యూపీహెచ్ సీ
  • మహేశ్వరం సీహెచ్ సీ


More Telugu News