నిందితులతో నాకు లింక్ పెట్టొద్దు: మీడియాకు సినీ నటి పూర్ణ విన్నపం
- సినీ నటి పూర్ణను బ్లాక్ మెయిల్ చేసిన దుండగులు
- పోలీసుల అదుపులో నిందితుడు
- నిందితుల్లో ఒకరు పూర్ణకు తెలుసని కొన్ని మీడియా సంస్థల్లో ప్రచారం
సినీ నటి పూర్ణ అలియాస్ కామ్నా కాసిమ్ కు బెదిరింపులు వచ్చిన కేసులో హెయిర్ స్టైలిస్ట్ ను కేరళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నలుగురు వ్యక్తులు తనను వేధిస్తున్నారని ఆమె కేరళ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు నిందితుల్లో ఒకరితో పూర్ణకు పరిచయం ఉందంటూ కొన్ని వార్తా సంస్థలు ప్రచురించాయి. ఈ నేపథ్యంలో ఫేస్ బుక్ ద్వారా పూర్ణ స్పందించింది.
'ఈ ఇబ్బందికర సమయంలో నాకు అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు. నా కేసుకు సంబంధించి కొన్ని మీడియా సంస్థలు అవాస్తవాలను రాశాయి. వీటిపై క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. ఈ బ్లాక్ మెయిల్ కేసులోని నిందితుడితో కానీ ఆ ముఠాతో కానీ నాకు ఎలాంటి లింక్ లేదు. నిందితుడితో లింక్ పెట్టి తప్పుడు వార్తలను రాయొద్దని మీడియాను కోరుతున్నాను.
తప్పుడు పేర్లు, తప్పుడు చిరునామాలతో పెళ్లి విషయంలో మమ్మల్ని మోసం చేసినందుకు పోలీసులకు ఫిర్యాదు చేయాలని మా కుటుంబం నిర్ణయించింది. మేము పోలీసులకు ఫిర్యాదు చేయబోతుండటంతో... వారు బ్లాక్ మెయిలింగ్ కు దిగారు.
మా ఫిర్యాదుపై కేరళ పోలీసులు అద్భుతంగా స్పందించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణ పూర్తయ్యేంత వరకు ఎలాంటి అవాస్తవాలను ప్రచురించవద్దని మీడియాను కోరుతున్నా. న్యాయ వ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉంది. కేసు విచారణ పూర్తైన తర్వాత మీడియాను కలుస్తా' అని పూర్ణ తెలిపింది.