కరోనా మందుపై యూటర్న్ తీసుకున్న పతంజలి

  • కరోనాకు మందు తయారు చేశామని చెప్పలేదు
  • కరోనిల్ కిట్ పేరుతో అమ్మకాలను జరపలేదు
  • కిట్ ఉపయోగాలను మాత్రమే వెల్లడించాం
కరోనా వైరస్ కు మందు కనిపెట్టామంటూ పతంజలి సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. 'కరోనిల్ కిట్' పేరుతో మందును మార్కెట్లోకి విడుదల చేస్తున్నామని... కరోనా పేషెంట్లపై ఈ మెడిసిన్ కు సంబంధించిన ట్రయల్స్ విజయవంతమయ్యాయని ప్రకటించింది. పతంజలి ప్రకటనతో కలకలం మొదలైంది. పతంజలికి ఉత్తరాఖండ్ ఆరోగ్యశాఖ నోటీసు జారీ చేసింది. దీంతో, నాలుగు రోజులు కూడా గడవక ముందే సదరు సంస్థ యూటర్న్ తీసుకుంది. తాము కరోనా  వైరస్ కు సంబంధించి ఎలాంటి మందును తయారు చేయలేదని పేర్కొంది. ఇదే విషయాన్ని ఉత్తరాఖండ్ ఆరోగ్యశాఖకు తెలిపింది.

కరోనా కిట్ పేరుతో తాము ఒక ప్యాకేజీని రెడీ చేశామని... ఇందులో దివ్య స్వాసరి వాతి, దివ్య కరోనిల్ ట్యాబ్లెట్, దివ్య అను తైలం ఉంటాయని పతంజలి చెప్పింది. కరోనిల్ కిట్ పేరుతో తాము ఇంత వరకు కమర్షిషల్ గా అమ్మలేదని తెలిపింది. కరోనా వ్యాధిని ఈ మందు నయం చేస్తుందని తాము ఎక్కడా ప్రచారం చేసుకోలేదని చెప్పింది. ఈ మందు ట్రయల్స్ విజయవంతమయ్యాయని మాత్రమే తాము మీడియా సమావేశంలో చెప్పామని తెలిపింది. ఈ మందు వల్ల కలిగే ప్రయోజనాల గురించి మాత్రమే తాము వెల్లడించామని పేర్కొంది.


More Telugu News