సుశాంత్ ఆత్మహత్య.. ఇండస్ట్రీలో నెపోటిజంపై నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు స్పందన
- టాలెంట్ లేకపోతే నెపోటిజం కాపాడలేదు
- అభిరామ్ కు హీరోగా అవకాశం ఇవ్వగలను.. కానీ అతనే నిరూపించుకోవాల్సి ఉంటుంది
- స్టార్ కిడ్స్ ఎంతో మంది హీరోలుగా ట్రై చేసి ఫెయిల్ అయ్యారు
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత ఇండస్ట్రీలో నెలకొన్న బంధుప్రీతి (నెపోటిజం)పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. తెలుగు సినీ పరిశ్రమలో కూడా బంధుప్రీతి ఎక్కువగానే ఉందనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా ఈ అంశంపై టాలీవుడ్ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు స్పందించారు.
ఇండస్ట్రీలో నెపోటిజం అనేది ఉంటే ఉండొచ్చని... అయితే టాలెంట్ లేకపోతే నెపోటిజం వారిని కాపాడలేదని సురేశ్ బాబు అన్నారు. ఎవరైనా సరే ఎవరికి వారు నిరూపించుకోవాల్సిందేనని చెప్పారు. పెద్దపెద్ద స్టార్లు కూడా వరుసగా రెండు, మూడు సినిమాలు ఫ్లాప్ అయి... రెండు, మూడేళ్లు ఖాళీగా కూర్చున్న సందర్భాలు ఉన్నాయని అన్నారు. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఉంటాయని... వాటిని సమర్థవంతంగా దాటుకుని రావాలని చెప్పారు.
స్టార్ హీరోలు, డైరెక్టర్ల కుటుంబాల్లో హీరోలుగా ట్రై చేసి ఫెయిల్ అయినవారు ఎంతోమంది ఉన్నారని సురేశ్ బాబు అన్నారు. తన కుమారుడు అభిరామ్ కు తాను హీరోగా అవకాశం మాత్రమే ఇవ్వగలనని... కానీ, హీరోగా అతనే ఎదగాల్సి ఉంటుందని చెప్పారు. ఎవరినైనా బలవంతంగా హీరోగా చేయలేమని... ప్రేక్షకులకు నచ్చితేనే హీరో అవుతాడని అన్నారు. తెలుగు విషయానికి వస్తే... రవితేజ, నాని, రాజ్ తరుణ్, విజయ్ దేవరకొండ వీరంతా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే స్టార్స్ గా ఎదిగారని చెప్పారు.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఎంతో సాధించాడని... స్టార్ అయ్యాడని అన్నారు. సూపర్ స్టార్ కావాల్సిన వాడని చెప్పారు. ఆయన మృతి బాధాకరమని అన్నారు.