మానవ మృగాలు రెచ్చిపోతుంటే దిశ చట్టం ఎక్కడ జగన్ గారూ?: నారా లోకేశ్

  • నెల్లూరు జిల్లా టూరిజం ఆఫీసులో అమానుషం
  • కాంట్రాక్టు ఉద్యోగినిపై డిప్యూటీ మేనేజర్ దాడి
  • డిప్యూటీ మేనేజర్ ను కఠినంగా శిక్షించాలన్న లోకేశ్
నెల్లూరు జిల్లా టూరిజం కార్యాలయంలో మాస్కు ధరించాలని సూచించిన ఓ కాంట్రాక్టు ఉద్యోగినిపై తీవ్రస్థాయిలో దాడి చేసిన డిప్యూటీ మేనేజర్ భాస్కర్ ను కఠినంగా శిక్షించాలని టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ డిమాండ్ చేశారు. దివ్యాంగురాలు అని కూడా చూడకుండా అత్యంత దారుణంగా హింసించిన డిప్యూటీ మేనేజర్  ను సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవడం సరికాదని పేర్కొన్నారు.

మానవ మృగాలు ఈ విధంగా రెచ్చిపోతుంటే, 21 రోజుల్లో న్యాయం చేసేందుకు తెచ్చిన దిశ చట్టం ఎక్కడ? అంటూ సీఎం జగన్ ను ప్రశ్నించారు.  మహిళలపై అత్యాచారాలు, దాడులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని, పాలకులే ప్రతీకారంతో చెలరేగిపోతుంటే కొందరు అధికారులు కూడా అదే పంథాలో అరాచకంగా వ్యవహరిస్తున్నారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.



More Telugu News