కరోనా లక్షణాలు కనిపించని వారిలో యాంటీబాడీల దారుణ క్షీణత

కరోనా లక్షణాలు కనిపించని వారిలో యాంటీబాడీల దారుణ క్షీణత
  • వైరస్ బారినపడి కోలుకున్న రెండు నెలల తర్వాత పరీక్ష
  • లక్షణాలు లేని 40 శాతం మందిలో అంతుబట్టని స్థాయిలో క్షీణించిన యాంటీబాడీలు
  • కరోనా నుంచి ఒకసారి కోలుకున్నా మళ్లీ వచ్చే అవకాశం ఉందని తేల్చిన అధ్యయనం
కరోనా వైరస్ లక్షణాలు కనిపించని వారిలో యాంటీబాడీలు త్వరగా క్షీణిస్తున్నట్టు చైనాకు చెందిన ఓ అధ్యయనం వెల్లడించింది. కరోనా నుంచి కోలుకున్న రెండు నెలల తర్వాత లక్షణాలు లేని వారిని పరీక్షించగా ఈ విషయం బయటపడింది. లక్షణాలు లేని దాదాపు 40 శాతం మందిలో యాంటీబాడీల సంఖ్య దారుణంగా పడిపోయిందని అధ్యయనకారులు తెలిపారు. అదే సమయంలో వైరస్ లక్షణాలున్న 13 శాతం మందిలోనే యాంటీబాడీల సంఖ్య క్షీణించినట్టు పేర్కొన్నారు. అంతేకాదు, ఒకసారి కోవిడ్ బారినపడి కోలుకున్న వారికి తిరిగి వైరస్ సోకదనే భావన తప్పన్న విషయం అధ్యయన ఫలితాల్లో స్పష్టమైంది. మరోవైపు, వైరస్ లక్షణాలు లేని వారిలో వాపు ప్రక్రియ నివారకాలుగా ఉపయోగపడే కణ సంకేత ప్రొటీన్ల సంఖ్య తక్కువగా ఉన్నట్టు అధ్యయనకారులు వివరించారు.


More Telugu News