ఎక్స్ రే చూసి కరోనాను నిర్ధారించే పరికరం... ఆవిష్కరించిన ఐఐటీ-గాంధీనగర్
- కంప్యూటర్ ప్రోగ్రామ్ తయారీ
- ఏఐ ఆధారంగా పనిచేసే ప్రోగ్రామ్
- కరోనాను గుర్తించవచ్చన్న రీసెర్చ్ టీమ్
కరోనా సోకిన వారికి చికిత్స సంగతి పక్కన పెడితే, వైరస్ సోకిందా? లేదా? అన్న విషయాన్ని తేల్చేందుకే రోజుల తరబడి సమయం పడుతున్న ఈ తరుణంలో గాంధీనగర్ ఐఐటీ విద్యార్థులు ఓ వినూత్న కంప్యూటర్ ప్రోగ్రామ్ ను తయారు చేశారు.
దీని ద్వారా ఛాతీ ఎక్స్ రేను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే డీప్ లెర్నింగ్ టూల్ కు అనుసంధానం చేసి, శరీరంలో కరోనా వైరస్ జాడలను పసిగట్టవచ్చు. ఇందుకోసం విద్యార్థులు ఓ కంప్యూటర్ ప్రోగ్రామ్ ను రూపొందించారు. ఎక్స్ రే చిత్రాలను పరిశీలిస్తే, కరోనా జాడను కనుగొనవచ్చని, మెదడులో 12 పొరల్లో ఉండే నాడీ వ్యవస్థ ఆధారంగా ఇది పని చేస్తుందని రీసెర్చ్ టీమ్ కు నేతృత్వం వహించిన ఎంటెక్ విద్యార్థి కుష్ పాల్ సింగ్ యాదవ్ వెల్లడించారు. ఈ విధానంపై మెడికల్ సిబ్బందికి శిక్షణ ఇప్పించి, దీనిని అందరికీ అందుబాటులోకి తేవచ్చని అన్నారు.