తెలంగాణలో భారీగా విస్తరిస్తున్న కరోనా.. ఈ రోజు 975 కేసుల నమోదు
- నేడు జీహెచ్ఎంసీ పరిధిలో 861 కేసుల నమోదు
- 15,394కి చేరుకున్న మొత్తం కేసుల సంఖ్య
- 253కి చేరిన మరణాలు
తెలంగాణలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 975 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 861 కేసులు నమోదు కాగా... రంగారెడ్డి జిల్లాలో 40, మేడ్చల్ జిల్లాలో 20, సంగారెడ్డిలో 14, కరీంనగర్ లో 10 కేసులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 8, వరంగల్ రూరల్ లో 5, వరంగల్ అర్బన్ లో 4 కేసులు నమోదయ్యాయి. ఆరుగురు మృతి చెందారు. ఈరోజుతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 15,394కి పెరిగింది. మృతుల సంఖ్య 253కి చేరుకుంది.
మరోవైపు రాజకీయ నాయకులపై కూడా కరోనా ప్రభావం చూపుతోంది. రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ కరోనా బారిన పడ్డారు. ఆయనను అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
హైదరాబాదులో కరోనా కేసులు ఆందోళనకర స్థాయిలో నమోదవుతుండటంతో... నగరంలో లాక్ డౌన్ విధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే సంకేతాలను ఇచ్చారు. రెండు, మూడు రోజుల్లో రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకోనున్నారు.
.