టిక్ టాక్ సహా 59 యాప్ లపై నిషేధం విధించిన కేంద్రం.. పూర్తి జాబితా ఇదిగో!

  • సమగ్రతకు హానికరమైన యాప్ లను ఉపేక్షించబోమన్న కేంద్రం
  • చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం
  • నిషేధిత జాబితాలో యూసీ బ్రౌజర్, హలో యాప్
గత కొంతకాలంగా చైనాతో సంబంధాలు క్షీణిస్తున్న నేపథ్యంలో చైనా ఉత్పత్తులు, చైనా సాంకేతికతపై భారత్ లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఎంతో ప్రజాదరణ పొందిన టిక్ టాక్ సహా 59 యాప్ లను నిషేధించింది. భారతదేశ సమగ్రత, సార్వభౌమత్వానికి, దేశ రక్షణకు, ప్రజా సంక్షేమానికి హానికరంగా భావిస్తున్న కార్యకలాపాలతో సంబంధం ఉందన్న కారణంతో ఈ యాప్ లను అడ్డుకుంటున్నామని కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది.

లడఖ్ లో జరిగిన ఘర్షణలో భారత్ కు చెందిన 21 మంది సైనికులు మరణించడంతో దేశవ్యాప్తంగా చైనా అంటే ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. టిక్ టాక్ వంటి యాప్ లను నిషేధించాలన్న డిమాండ్లు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో, కేంద్రం ఏకంగా 59 యాప్ లపై కొరడా ఝుళిపించింది. ఈ జాబితాలో టిక్ టాక్, యూసీ బ్రౌజర్, వుయ్ చాట్, వీగో వీడియో, హలో యాప్, షేర్ ఇట్, బ్యూటీ ప్లస్ వంటి యాప్స్ ఉన్నాయి.


More Telugu News