ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం మృతదేహం.. శరీరంపై గాయాలు.. వీడియో ఇదిగో!

  • కోల్ కతాకు 150 కి.మీ. దూరంలో ఉన్న మందర్మానీ బీచ్ ఒడ్డుకు కొట్టుకొచ్చిన తిమింగలం
  • గతంలో ఎప్పుడూ ఇలాంటి సంఘటన చూడలేదంటున్న స్థానికులు
  • హుటాహుటిన అక్కడకు చేరుకున్న అధికారులు
35 అడుగుల పొడవున్న ఓ భారీ తిమింగలం మృతదేహం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. కోల్ కతాకు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న మందర్మానీ బీచ్ లో ఇది ఒడ్డుకు కొట్టుకొచ్చింది. ఇంత పెద్ద తిమింగలం ఒడ్డుకు కొట్టుకురావడాన్ని తాము ఇంతకు ముందు ఎన్నడూ చూడలేదని స్థానికులు చెపుతున్నారు. దాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో జనాలు అక్కడకు వస్తున్నారు. తిమింగలం ముఖ భాగం రక్తసిక్తమై ఉంది. తల, తోక భాగంలో దానికి ఎందుకు గాయాలయ్యాయనే విషయం తేలాల్సి ఉంది.

తిమింగలం ఒడ్డుకు కొట్టుకొచ్చిందనే సమాచారం అందిన వెంటనే... ఈస్ట్ మిడ్నపూర్ జిల్లాకు చెందిన అటవీ, వైల్డ్ లైఫ్, మత్స్యశాఖలకు చెందిన అధికారులు హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకున్నారు. బంగాళాఖాతం తీరంలో ఉన్న మందర్మానీ బీచ్ కు పర్యాటక ప్రాంతంగా గుర్తింపు ఉంది. మరో టూరిస్ట్ ప్లేస్ దిఘాకు సమీపంలో ఇది ఉంది. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రస్తుతం పర్యాటకులపై నిషేధం ఉంది.


More Telugu News