పాకిస్థాన్ స్టాక్ ఎక్చేంజ్ పై దాడికి బాధ్యత ప్రకటించుకున్న బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ

  • కరాచీలోని స్టాక్ ఎక్చేంజ్ పై భీకర ఉగ్రదాడి
  • దాడికి పాల్పడిన మాజిద్ బ్రిగేడ్ సభ్యులు
  • బీఎల్ఏ ఆత్మాహుతి విభాగంగా గుర్తింపు పొందిన మాజిద్ బ్రిగేడ్
పాకిస్థాన్ లో మరోసారి ఉగ్రదాడి కలకలం చెలరేగింది. కరాచీలో ఉన్న స్టాక్ ఎక్చేంజ్ పై ఉగ్రవాదులు తీవ్రస్థాయిలో దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో పాల్గొన్న నలుగురు ఉగ్రవాదులను పాక్ భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. అయితే, నలుగురు సెక్యూరిటీ గార్డులు, ఓ పోలీసు అధికారి కూడా ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. కాగా, స్టాక్ ఎక్చేంజ్ పై ఉగ్రదాడి తమ పనే అంటూ బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) తెలిపింది. బీఎల్ఏకు చెందిన ఆత్మాహుతి దళం మాజిద్ బ్రిగేడ్ ఈ దాడిలో పాల్గొన్నట్టు ప్రకటించింది. మృతిచెందిన ఉగ్రవాదులను తస్లీమ్ బలోచ్, షెహ్ జాద్ బలోచ్, సల్మాన్ హమ్మల్, సిరాజ్ కుంగూర్ గా గుర్తించారు. ఈ దాడిపై పాక్ సైన్యం స్పందిస్తూ, విదేశీ ఏజెన్సీల ప్రమేయాన్ని తోసిపుచ్చలేమని వ్యాఖ్యానించింది.


More Telugu News