ఐసీసీ ఎలైట్ ప్యానల్ లో భారత అంపైర్ కు చోటు

  • 12 మందితో ఎలైట్ ప్యానల్ అంపైర్ల జాబితా విడుదల చేసిన ఐసీసీ
  • ప్యానల్ లో పిన్నవయస్కుడిగా నితిన్ కు గుర్తింపు
  • భారత్ నుంచి ఎంపికైన మూడో అంపైర్ గా నిలిచిన నితిన్
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా 2020-21 సీజన్ కు ఎలైట్ ప్యానల్ అంపైర్ల జాబితా విడుదల చేసింది. 12 మందితో కూడిన ఈ జాబితాలో భారత్ కు చెందిన నితిన్ మీనన్ కు కూడా స్థానం లభించింది. నితిన్ మీనన్ ఇప్పటివరకు 3 టెస్టులు, 24 వన్డేలు, 16 టీ20 అంతర్జాతీయ మ్యాచ్ లలో అంపైరింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. ఎస్.వెంకటరాఘవన్, సుందరం రవి తర్వాత ఐసీసీ ఎలైట్ ప్యానల్ లో సభ్యత్వం పొందిన మూడో భారత అంపైర్ నితిన్ మీననే. అంతేకాదు, ఎలైట్ ప్యానల్ అంపైర్లందరిలోకి నితిన్ మీనన్ చిన్నవాడు. నితిన్ మీనన్ వయసు 36 సంవత్సరాలు. ఐసీసీ ఎలైట్ ప్యానల్ కు ఎంపికైన నితిన్ మీనన్ సీనియర్ అంపైర్ నైగెల్ లాంగ్ స్థానాన్ని భర్తీచేస్తాడు.


More Telugu News