బంగ్లాదేశ్ లో విషాద ఘటన... బోటు మునిగి 30 మంది దుర్మరణం

బంగ్లాదేశ్ లో విషాద ఘటన... బోటు మునిగి 30 మంది దుర్మరణం
  • బురిగంగ నదిలో ప్రమాదం
  • పరస్పరం ఢీకొన్న రెండు బోట్లు
  • పెద్ద సంఖ్యలో గల్లంతు
  • కొనసాగుతున్న గాలింపు చర్యలు
బంగ్లాదేశ్ లో రెండు బోట్లు ఢీకొన్న ఘటనలో 30 మంది మృతి చెందారు. అనేకమంది ప్రయాణికులు గల్లంతయ్యారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా సమీపంలో బురిగంగ నదిలో ఈ ప్రమాదం సంభవించింది. 'మార్నింగ్ బర్డ్' అనే పేరున్న బోటు 100 మంది ప్రయాణికులతో వెళుతుండగా, మరో బోటు వెనుకనుంచి ఢీకొంది. దాంతో ఆ బోటు నీటిలో మునిగిపోయింది. ఇప్పటివరకు 30 మృతదేహాలను వెలికితీశారు. వారిలో ఏడుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా, అవడానికి చిన్నదేశమే అయినా బంగ్లాదేశ్ లో 230 వరకు నదులున్నాయి. ఎక్కువ శాతం ప్రయాణాలు నదీ మార్గాల ద్వారానే జరుగుతుంటాయి. దాంతో నదుల్లో ప్రమాదాల శాతం కూడా ఎక్కువే.


More Telugu News