పదో తరగతి పరీక్షలు అవసరమా... అసలు పూర్తిగా రద్దు చేస్తే పోలా?: మంచు విష్ణు
- కరోనా వ్యాప్తితో పలు రాష్ట్రాల్లో 'పది' పరీక్షలు రద్దు
- పిల్లలపై అంత ఒత్తిడి దేనికన్న మంచు విష్ణు
- పబ్లిక్ పరీక్షలతో ఏంటి ప్రయోజనం అంటూ ట్వీట్
కరోనా భయంతో అనేక రాష్ట్రాలు పదో తరగతి పరీక్షలు రద్దు చేశాయి. దీనిపై టాలీవుడ్ యువ హీరో మంచు విష్ణు స్పందించారు. 14, 15 సంవత్సరాల పిల్లలపై ఈ బోర్డు ఎగ్జామ్స్ ఒత్తిడి ఏంటని ప్రశ్నించారు. బోర్డు ఎగ్జామ్స్ తో ఏం ప్రయోజనం? అని ట్వీట్ చేశారు.
"పదో తరగతి కోసం నిర్వహించే పబ్లిక్ పరీక్షలను ఈసారికి మాత్రమే కాదు, అసలు పూర్తిగా ఎత్తేయాలని బలంగా భావిస్తున్నాను. పదో తరగతికి బోర్డు ఎగ్జామ్స్ అనేవే ఉండకూడదు" అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
"పదో తరగతి కోసం నిర్వహించే పబ్లిక్ పరీక్షలను ఈసారికి మాత్రమే కాదు, అసలు పూర్తిగా ఎత్తేయాలని బలంగా భావిస్తున్నాను. పదో తరగతికి బోర్డు ఎగ్జామ్స్ అనేవే ఉండకూడదు" అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.