అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్ పై విచారణకు కరోనా దెబ్బ!

  • అచ్చెన్న బెయిల్ పిటిషన్ పై విచారణ జూలై 1కి వాయిదా
  • రాష్ట్రంలో కరోనా విజృంభణ
  • జూన్ 30 వరకు కోర్టు పనుల నిలిపివేత
ఏపీలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. ఒకట్రెండు జిల్లాలు మినహాయించి అన్ని జిల్లాల్లో భారీగా కరోనా పాజిటివ్ కేసులు వెల్లడవుతున్నాయి. ఈ నేపథ్యంలో న్యాయస్థానాల కార్యకలాపాలను ఈ నెల 30 వరకు నిలిపివేశారు. దాంతో టీడీపీ నేత అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్ పై విచారణను ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో కోర్టు పనులు నిలిచిపోయాయని, అందుకే జూలై 1న బెయిల్ పిటిషన్ విచారిస్తామని వెల్లడించింది. అచ్చెన్నాయుడికి ఇటీవలే మూడ్రోజుల ఏసీబీ కస్టడీ ముగిసింది.


More Telugu News