ఈ రోజు జగన్‌కు సమాధానం చెప్పనున్న రఘురామకృష్ణ రాజు
- ఈ రోజు మధ్యాహ్నం గం.12లోగా షోకాజ్ నోటీసుకు జవాబు
- ఇప్పటికే విజయసాయిరెడ్డికి సమాధానం
- పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదన్న ఎంపీ
- ఢిల్లీలో పలువురిని కలిసి అభిప్రాయాలు తీసుకున్న నేత
నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణ రాజుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇటీవల షోకాజ్ నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, పార్టీ లెటర్ హెడ్ కాకుండా మరో పేరుతో నోటీసు ఇవ్వడంపై అభ్యంతరాలు తెలిపిన రఘురామకృష్ణ రాజు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలలోపు ఏపీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు నోటీసులపై సమాధానం ఇవ్వనున్నారు.
ఇప్పటికే విజయసాయిరెడ్డికి రఘురామకృష్ణ రాజు సమాధానం ఇచ్చారు. పార్టీ పేరుకు, తనకు నోటీసు ఇచ్చిన వారి హోదాకు పొంతన లేదని తెలిపారు. తాను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని సమాధానం చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాల వల్ల ప్రజలకు కలిగిన ఇబ్బందులను సీఎం దృష్టికి తీసుకెళ్లానని అన్నారు.
ఇది తప్పెలా అవుతుందని ప్రశ్నించిన ఆయన తాను జగన్‌కు, పార్టీకి వ్యతిరేకంగా ఎన్నడూ మాట్లాడలేదని తెలిపారు. ఇప్పటికే ఆయన ఢిల్లీలో పలువురిని కలిసి అభిప్రాయాలు తీసుకున్న విషయం తెలిసిందే.