ఏపీఎస్ఆర్టీసీ వెబ్ సైట్ ఈ నెల 30న పనిచేయదు... కారణం ఇదే!
- ఆ రోజు సర్వర్ నిలిపివేస్తున్నట్టు వెల్లడి
- ఆధునికీకరణ దిశగా ఏపీఎస్ఆర్టీసీ వెబ్ సైట్
- ఒకేసారి 50 వేల మంది సేవలు పొందేలా మార్పులు
కరోనా మహమ్మారి పుణ్యమా అని అనేక వ్యవస్థల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) కూడా ఆధునికీకరణ బాటలో పయనిస్తోంది. తాజాగా అన్ని బస్సు సర్వీసుల్లో రిజర్వేషన్ విధానం అమలు చేయాలని సంకల్పించింది. అందుకోసం ఏపీఎస్ఆర్టీసీ వెబ్ సైట్ లో మార్పులు చేర్పులు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ వెబ్ సైట్ ను ఈ నెల 30న అప్ డేట్ చేస్తున్నారు. ఆ రోజున తమ వెబ్ సైట్ పనిచేయదని, సర్వర్ ను నిలిపివేస్తున్నామని ఆర్టీసీ వెల్లడించింది. ఈ సందర్భంగా టికెట్లు బుక్ చేసుకోవడం, టికెట్ క్యాన్సిలేషన్ వీలుపడదని తెలిపింది.
తాజా ఆధునికీకరణ అనంతరం ఒకేసారి 50 వేల మంది సైట్ లో కార్యకలాపాలు నిర్వర్తించినా ఎలాంటి అసౌకర్యం కలగదని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా, నగదు రహిత టికెటింగ్, కాంటాక్ట్ లెస్ టికెటింగ్ వ్యవస్థను తీసుకురావాలని ప్రయత్నిస్తున్న ఏపీఎస్ఆర్టీసీ ఆ దిశగా ముందడుగు వేస్తూ అందుకు అనుగుణంగా తన వెబ్ సైట్ కు కొత్త హంగులు తీసుకువస్తోంది.