హైదరాబాద్ పోలీస్ అకాడమీలో 180 మందికి కరోనా... ఎవరికీ లక్షణాలు లేవు!
- పోలీస్ అకాడమీలో కరోనా కల్లోలం
- 100 మంది ట్రైనీ ఎస్సైలకు, 80 మంది సిబ్బందికి పాజిటివ్
- అకాడమీలో మొత్తం 2,200 మంది
- భారీగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది
కరోనా మహమ్మారి హైదరాబాదులోని పోలీస్ అకాడమీలో కూడా బీభత్సం సృష్టిస్తోంది. అకాడమీలోని 180 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. వారిలో 100 మంది ట్రైనీ ఎస్సైలు కాగా, మరో 80 మంది అకాడమీ సిబ్బంది. ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే వారిలో ఎవరికీ కరోనా లక్షణాలు లేవు. దాంతో కరోనా పాజిటివ్ వచ్చిన వారికి అకాడమీలోనే క్వారంటైన్ ఏర్పాటు చేసినట్టు అకాడమీ డైరెక్టర్ వీకే సింగ్ వెల్లడించారు.
ప్రస్తుతం ఈ అకాడమీలో 1100 మంది సబ్ ఇన్ స్పెక్టర్లు, 600 మందికి పైగా కానిస్టేబుళ్లు ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఇక శిక్షణ ఇచ్చే సిబ్బంది, పాలనాపరమైన సిబ్బందితో కలిపి మొత్తం 2,200 మంది వరకు ఉంటారు. ఈ నేపథ్యంలో, మరిన్ని పాజిటివ్ కేసులు బయటపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం అకాడమీలో భారీ ఎత్తున కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు.