కర్నూలు, కృష్ణా జిల్లాల్లో కరోనా మరణమృదంగం... 24 గంటల్లో 12 మంది బలి
- ఏపీలో ఇప్పటివరకు 169 మంది బలి
- కొత్తగా 813 మందికి కరోనా
- రాష్ట్రంలో 13 వేలు దాటిన పాజిటివ్ కేసుల సంఖ్య
ఏపీలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గడచిన 24 గంటల వ్యవధిలో 12 మంది మృత్యువాత పడ్డారు. కర్నూలు జిల్లాలో ఆరుగురు, కృష్ణా జిల్లాలో ఐదుగురు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకరు మరణించారు. దాంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 169కి పెరిగింది.
ఇక, కొత్తగా 813 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. వారిలో 50 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కాగా, మరో 8 మంది విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చారు. ఓవరాల్ గా ఏపీలో కరోనా కేసుల సంఖ్య 13,098కి పెరిగింది. తాజాగా 401 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు ఏపీలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 5,908 కాగా, మరో 7,021 మంది చికిత్స పొందుతున్నారు.