ఈ ఫొటోలో పెద్ద కొండచిలువ ఉంది.. గుర్తించగలరా?

  • ఫొటో పోస్ట్ చేసిన పాములు పట్టే వ్యక్తి
  • ఆస్ట్రేలియాలో కొండచిలువను పట్టుకునేందుకు వెళ్లిన వ్యక్తి
  • కర్రల మధ్య కర్రలా కలిసిపోయిన కొండచిలువ
ఈ ఫొటోలో అన్ని కర్రలే ఉన్నాయని అనుకుంటే పొరపాటు పడ్డట్లే. వాటి మధ్యలో ఓ పొడవాటి కొండచిలువ ఉంది. దాన్ని గుర్తించకుండా కర్రలను ఆ ప్రాంతంలోంచి తీయాలని అనుకుంటే ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్లే.

ఆస్ట్రేలియాలోని కోరిండాలో పామును పట్టేందుకు వెళ్లిన ఓ వ్యక్తి.. కర్రల మధ్య ఉన్న దాన్ని గుర్తించి, ఇందుకు సంబంధించిన ఫొటోను పోస్ట్ చేశాడు. ఆ కర్రల మధ్యలో కర్రలా ఉన్న కొండ చిలువ ఎక్కడ ఉందో కనిపెట్టలేక నెటిజన్లు తికమకపడుతున్నారు.

తాను పోస్ట్ చేసిన ఈ ఫొటోలో పాము ఎక్కడ ఉందో కనిపెట్టాలని ఆయన సవాలు విసిరాడు. కొందరు ఆ ఫొటోను జూమ్ చేసి పాము ఎక్కడో కనిపెట్టి సమాధానాలు ఇస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఈ ఫొటో వైరల్ అవుతోంది. కొండచిలువలు మనుషులకు దొరకకుండా చాలా చురుకుగా వ్యవహరిస్తాయని పాములు పట్టే వ్యక్తి చెప్పాడు. ఈ పై ఫొటోను జూమ్‌ చేసినప్పటికీ మీకు పాము కనపడకపోతే ఈ కింది ఫొటోను చూడండి..
           


More Telugu News