ఏపీ ప్రభుత్వానికి ఎక్కిన నిషా ఇప్పటికి దిగింది: వర్ల రామయ్య ఆసక్తికర వ్యాఖ్యలు

  • హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకూ మొట్టికాయలు
  • ఆ తరువాతే రంగుల విషయంలో దిగొచ్చారు
  • ఇది ప్రజాస్వామ్యం సాధించిన విజయమన్న వర్ల
గ్రామ సచివాలయాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు వేయడంపై హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకూ మొట్టికాయలు తిన్న జగన్ ప్రభుత్వానికి, ఇప్పటికి తలకెక్కిన నిషా దిగిందని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. ఇదేమీ తమ పార్టీ సాధించిన విజయం కాదని, ప్రజాస్వామ్యం సాధించిన విజయంగానే భావిస్తున్నామని, గ్రామ సచివాలయాలపై సీఎం జగన్ చిత్రాన్ని కూడా ఉంచరాదని వర్ల అభిప్రాయపడ్డారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన, అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని గౌరవించాల్సిందేనని అన్నారు.

కాగా, ఈ నెల 30లోగా గ్రామ సచివాలయాలకు వేసిన రంగులను తొలగించాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో, వాటన్నింటికీ తెలుపు రంగు వేయాలని అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. ఆపై నిన్న రంగులపై జీవో జారీ అయింది. సచివాలయాలకు క్రీమ్ కలర్ వేయాలని కిందవైపున రెండున్నర అడుగుల ఎత్తు వరకూ ఎర్ర మట్టిరంగు వేసి, దానిపై 8 అంగుళాల ఎత్తునకు ముగ్గులు వేయాలని అధికారులు ఆదేశించారు.


More Telugu News