మళ్లీ రాజకీయాల్లోకి యశ్వంత్ సిన్హా.. కొత్త పార్టీని స్థాపిస్తున్నట్టు ప్రకటన
- త్వరలోనే పార్టీ పేరు ప్రకటన
- మోదీ, నితీశ్ ప్రభుత్వాలను గద్దె దింపడమే లక్ష్యం
- బెటర్ బీహార్ నినాదంతో ప్రజల్లోకి
సీనియర్ నేత యశ్వంత్ సిన్హా తిరిగి రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు. బీజేపీ నుంచి తప్పుకుని గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న సిన్హా.. నూతన పార్టీతో తిరిగి కాలుమోపబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ప్రకటించారు. ‘బెటర్ బీహార్’ లక్ష్యంగా పార్టీని స్థాపిస్తున్నట్టు పేర్కొన్న ఆయన త్వరలోనే పార్టీ పేరును ప్రకటిస్తానన్నారు. మోదీ సారథ్యంలోని ఎన్‌డీయే ప్రభుత్వాన్ని గద్దె దింపడమే తన లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
తమతో కలిసి వచ్చేందుకు సిద్ధపడే వారిని సాదరంగా ఆహ్వానిస్తామని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను బరిలోకి దింపుతామన్నారు. తమకు ఎలాంటి రిజర్వేషన్లు లేవని, బెటర్ బీహార్ కోసం శాయశక్తులా ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నితీశ్ కుమార్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుత బీద పరిస్థితికి ఆయనే కారణమన్నారు. మెరుగైన బీహార్ కోసం నితీశ్ సర్కారును కూడా గద్దె దింపుతామని సిన్హా పేర్కొన్నారు.