దాసరి కుమారులుగా ఉండి, ఆయన పేరును చెడగొడుతున్నాం... బాధగా ఉందన్న అరుణ్ కుమార్!
- ఇండస్ట్రీ సమస్యలు పరిష్కరించిన వ్యక్తి దాసరి
- తమ ఇంట్లో ఉన్నది ఆస్తి గొడవ మాత్రమే
- అన్నయ్య ప్రభు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్న అరుణ్
తెలుగు సినీ ఇండస్ట్రీలోని ఏ శాఖలో ఎవరికి సమస్య వచ్చినా, ముందు నిలిచి, దాన్ని పరిష్కరిస్తారన్న పేరు తెచ్చుకున్న దాసరి నారాయణరావు కుమారులమై ఉండి, ఆయన పేరును చెడగొడుతున్నామని, ఇందుకు తనకెంతో బాధగా ఉందని నటుడు దాసరి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు అరుణ్ పై అతని అన్న ప్రభు పోలీసు కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అరుణ్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు.
ప్రతి ఇంట్లో ఉన్నట్టుగానే తమ ఇంట్లోనూ సమస్యలు ఉన్నాయని, అవి వంద శాతం ఆస్తి గొడవలేనని స్పష్టం చేశారు. తాను 24న ఫిల్మ్ నగర్ రోడ్ నంబర్ 47లో ఉన్న తమ ఇంటికి వెళ్లానని, ఆ రోజు తనకు కొరియర్ వచ్చిందని ఫోన్ రాగా, దాన్ని కలెక్ట్ చేసుకునేందుకే వెళ్లానని అరుణ్ వెల్లడించారు. దాసరి నారాయణరావు చనిపోయేంత వరకూ ఇదే ఇంట్లో ఉన్నామని, ప్రస్తుతం అక్కడ పెద్ద కుమారుడైన ప్రభు తన ఫ్యామిలీతో ఉంటున్నారని గుర్తు చేసిన అరుణ్, అరగంట సేపు కాలింగ్ బెల్ కొట్టినా ఎవరూ తలుపు తీయలేదని, తన ఇల్లే కదా అన్న ఉద్దేశంతోనే గోడ దూకి వెళ్లానని తెలిపారు.
గతంలోకూ తాను గోడ దూకి వెళ్లిన సందర్భాలు ఉన్నాయని, ఆ తరువాత హాలు తలుపు తీసుకుని, లోనికి వెళ్లగా ఎవరూ లేరని, దీంతో పైకి వెళ్లిన తరువాత అన్నయ్య కనిపించాడని చెప్పారు. తనకు ఓ డాక్యుమెంట్ వచ్చిందని, దాన్ని ఇవ్వాలని కోరగా, తొలుత లేదని చెప్పి, హడావుడిగా కిందకు వెళ్లిన అన్న, పోలీసులకు సమాచారం ఇచ్చారని, పోలీసులు వచ్చిన తరువాత, తాను విషయం చెబితే, వారే డాక్యుమెంట్ ను ఇప్పించారని, ఆ తరువాత తాను వెళ్లిపోయానని అన్నారు.
ఆపై ఒక రోజు గ్యాప్ తీసుకుని, ప్రభు తనమీద పోలీసు కేసు పెట్టారని, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అరుణ్ ఆరోపించారు. గత సంవత్సరం మే నుంచి ఆస్తి గొడవలు సాగుతున్నాయని చెప్పిన అరుణ్, కూర్చుని చర్చించి, సమస్యను సాల్వ్ చేసుకునేందుకు తాను సిద్ధమేనని తెలిపారు.