యూఎస్ వర్శిటీపై హ్యాకర్ల దాడి... అడిగినంత డబ్బులిచ్చి బయటపడ్డారు!

  • యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాపై హ్యాకర్ల దాడి
  • అపై డబ్బు డిమాండ్ చేసిన హ్యాకర్లు
  • 1.14 మిలియన్ డాలర్లు చెల్లించిన యాజమాన్యం
అమెరికాలోని ప్రతిష్ఠాత్మక యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాపై హ్యాకర్లు సైబర్ దాడి చేసి, విలువైన సమాచారాన్ని తమ అధీనంలోకి తెచ్చుకోగా, వారు అడిగినంత డబ్బులిచ్చి తమ సమస్య నుంచి తప్పించుకున్నారు వర్శిటీ అధికారులు. వివరాల్లోకి వెళితే, యూనివర్శిటీలోని స్కూల్ ఆఫ్ మెడిసిన్ కు సంబంధించిన సమాచారాన్ని హ్యాకర్లు ఎన్ క్రిప్ట్ చేశారు. దీంతో అక్కడి అధికారులు షాక్ నకు గురయ్యారు.

ఈలోగా వర్శిటీ యాజమాన్యాన్ని హ్యాకర్లు సంప్రదించి, డబ్బు డిమాండ్ చేశారు. వారి చేతుల్లోని డేటాను తీసుకోవాలంటే, వారు అడిగినంత డబ్బు ఇవ్వడం తప్ప మరో విధిలేదని భావించిన అధికారులు, 1.14 మిలియన్ డాలర్లు చెల్లించారు. డబ్బు తమ చేతికి అందగానే, హ్యాకర్లు కీ అందించగా, దాని సాయంతో తమ సమాచారాన్ని తిరిగి అన్ లాక్ చేసుకున్నారు. అయితే, ఇందులో పేషంట్లకు సంబంధించిన సమాచారం ఏమీ లేదని వర్శిటీ అధికారులు వెల్లడించారు.


More Telugu News