వైన్ షాపులో పని చేస్తున్న వ్యక్తికి కరోనా.. బెంబేలెత్తుతున్న మందుబాబులు!
- నల్గొండ జిల్లాలో వైన్ షాపులో పని చేస్తున్న వ్యక్తికి కరోనా
- ఆ వైన్ షాప్ నుంచి 300 బెల్ట్ షాపులకు మద్యం సరఫరా
- ప్రైమరీ కాంటాక్ట్స్ పై ఆరా తీస్తున్న అధికారులు
తెలంగాణలో జీహెచ్ఎంసీ ప్రాంతంతో పాటు క్రమంగా ఇతర జిల్లాల్లో కూడా కరోనా కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. తాజాగా నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో ఉన్న ఒక వైన్ షాపు ఇప్పుడు కలకలం రేపుతోంది. వైన్ షాపులో పని చేస్తున్న ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
తీవ్రమైన జ్వరం, దగ్గుతో బాధపడుతూనే అతను వైన్ షాపుకు వచ్చాడు. ఈ వైన్ షాపు నుంచి 300 బెల్టు షాపులకు మద్యం సరఫరా అవుతోంది. ఇప్పుడు ఇతనికి కరోనా అని నిర్ధారణ కావడంతో... ఆ వైన్ షాపులో పని చేస్తున్న వారికి, అక్కడ మందు కొనుగోలు చేసిన వ్యక్తులకు, అక్కడి నుంచి మద్యం తీసుకెళ్లిన బెల్డ్ షాపుల వారికి దడ పుడుతోంది. అధికారులు అతని ప్రైమరీ కాంటాక్ట్స్ పై ఆరా తీస్తున్నారు.