కరోనా పంజా... కర్ణాటకలో ఒకే రోజు ఆందోళనకర స్థాయిలో పెరిగిన కేసులు!

  • 24 గంటల్లో 918 కేసుల నమోదు
  • ప్రాణాలు కోల్పోయిన 11 మంది
  • 11,923కి చేరిన మొత్తం కేసుల సంఖ్య
కర్ణాటకలో కరోనా వైరస్ కోరలు చాస్తోంది. జనాలను బెంబేలెత్తిస్తోంది. గత 24 గంటల్లో ఏకంగా 918 కొత్త కేసులు నమోదయ్యాయి. 11 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 11,923కి చేరింది. వీరిలో 4,441 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 7,287 మంది కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు మొత్తం 191 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వివరాలను కర్ణాటక ఆరోగ్యశాఖ విడుదల చేసింది.

మరోవైపు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బెంగళూరులో మరోసారి లాక్ డౌన్ విధిస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో, సీఎం యడియూరప్ప మాట్లాడుతూ... రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ముఖ్యమేనని... ఎట్టి పరిస్థితుల్లో మళ్లీ లాక్ డౌన్ విధించే పరిస్థితే లేదని ప్రకటించారు.


More Telugu News