పంచాయతీలకు రంగులు మార్చాలంటూ ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం.. టీడీపీ సెటైర్లు!
- ఆకుపచ్చ, నీలం రంగులు తొలగించాలని ఆదేశాలు
- తెలుపు రంగు వేయాలని, సీఎం బొమ్మ ఉంచాలని ఉత్తర్వులు
- 14వ ఆర్థిక సంఘం నిధులను ఖర్చు చేయాలని ఆదేశాలు
ప్రభుత్వ కార్యాలయాలకు వేసిన పార్టీ రంగులను తొలగించాల్సిందేనంటూ హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో... ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీ కార్యాలయాలకు రంగులు మార్చాలని, కేవలం తెలుపు రంగు మాత్రమే వేయాలని ఆదేశాలు జారీ చేసింది. భవనాలపై ఉన్న ఆకుపచ్చ, నీలం రంగులను వెంటనే తొలగించాలని ఆదేశాలలో పేర్కొంది. రంగులు వేయడానికి 14వ ఆర్థిక సంఘం నిధులను ఖర్చు చేయాలని తెలిపింది. అయితే కార్యాలయాలపై జగన్ బొమ్మ ఉండాలని స్పష్టం చేసింది.
మరోవైపు ప్రభుత్వ నిర్ణయంపై టీడీపీ నేత వర్ల రామయ్య సెటైర్లు వేశారు. ప్రభుత్వానికి తలకెక్కిన మత్తు ఇన్నాళ్లకు దిగిందని అన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం సీఎం బొమ్మ వేయడానికి కూడా కుదరదని చెప్పారు. అందుకే సీఎం బొమ్మను కూడా ప్రభుత్వం ఇప్పుడే తొలగించాలని... లేకపోతే ఎవరో ఒకరు మళ్లీ కోర్టుకు వెళ్తారని చెప్పారు.