జూలై 10 వరకు అచ్చెన్నాయుడి రిమాండ్ పొడిగింపు

  • అచ్చెన్నపై ఈఎస్ఐ కొనుగోళ్ల ఆరోపణలు
  • ముగిసిన మూడ్రోజుల ఏసీబీ విచారణ
  • ఈ సాయంత్రంతో ముగిసిన 14 రోజుల రిమాండ్
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుపై మూడ్రోజుల ఏసీబీ విచారణ ఈ సాయంత్రం ముగిసింది. గతంలో ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా అది ఈ సాయంత్రంతో ముగిసింది. దాంతో, ఏసీబీ కోర్టు రిమాండ్ ను జూలై 10 వరకు పొడిగించింది. అచ్చెన్నాయుడు గతంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన కాలంలో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో అత్యంత నాటకీయ పరిణామాల మధ్య ఏసీబీ అధికారులు అచ్చెన్నను అరెస్ట్ చేసి రోడ్డు మార్గంలో విజయవాడ తరలించారు. అయితే ఆయన అప్పటికే పైల్స్ ఆపరేషన్ చేయించుకుని ఉండడంతో అనేక విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, గాయం తిరగబెట్టడంతో ఆయనను గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. ఏసీబీ అధికారులు అచ్చెన్నను ఆసుపత్రిలోనే విచారించారు.


More Telugu News