విద్యార్థుల సమస్యల పరిష్కారానికి టోల్‌ఫ్రీ నంబర్ విడుదల: ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్
- కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చుదిద్దుతున్నాం
- ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలను మార్చడమే జగన్ లక్ష్యం
- హెడ్మాస్టర్ల కోసం త్వరలోనే టోల్ ఫ్రీ నంబర్
కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చాలని ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పారు.
'మన బడి నాడు-నేడు' కార్యక్రమం కింద టేబుల్స్, తాగునీరు, మరుగుదొడ్లు, ప్రహరీ గోడలు తదితర తొమ్మిది అంశాలకు ప్రాధాన్యతను ఇస్తున్నామని చెప్పారు. ఆగస్టు చివరి నాటికి పాఠశాలలను తెరిచే అవకాశాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. 'మన బడి నాడు - నేడు' కార్యక్రమంపై ఈరోజు ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ మేరకు వివరాలను వెల్లడించారు.
విద్యార్థుల కోసం 1800 123 123 124 టోల్ ఫ్రీ నంబర్ ను ఈ సందర్భంగా మంత్రి విడుదల చేశారు. విద్యార్థులకు ఏ సమస్య ఉన్నా ఈ టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేయవచ్చని తెలిపారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయుల కోసం త్వరలోనే మరో టోల్ ఫ్రీ నంబర్ ను విడుదల చేస్తామని చెప్పారు. ప్రస్తుతం కొన్ని కోర్టు వివాదాలు ఉన్నాయని... అవి పరిష్కారం అయిన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని అన్నారు.