సుశాంత్ సింగ్ రాజ్ పుత్ పేరిట ఫౌండేషన్ ఏర్పాటు... ప్రతిభావంతులను ప్రోత్సహిస్తామన్న తండ్రి
- ఇటీవలే ఆత్మహత్య చేసుకున్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్
- సుశాంత్ ఆత్మహత్యపై భిన్న వాదనలు
- అవకాశాలు తన్నుకుపోవడంతో మనస్తాపం చెందాడంటూ ప్రచారం
- ఫౌండేషన్ ద్వారా సినీ, క్రీడా, సైన్స్ రంగాల్లో ప్రోత్సహిస్తామన్న సుశాంత్ తండ్రి
ఇటీవల ముంబయిలో బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర కలకలం రేపింది. అవకాశాలు రాకుండా చేయడం వల్లే మనస్తాపానికి గురై సుశాంత్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని బలంగా వినిపించింది. ఈ నేపథ్యంలో, సుశాంత్ కుటుంబం కీలక నిర్ణయం తీసుకుంది. తన కుమారుడి పేరిట సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఫౌండేషన్ ఏర్పాటు చేస్తున్నట్టు తండ్రి కృష్ణకుమార్ సింగ్ వెల్లడించారు.
ఈ ఫౌండేషన్ ద్వారా ప్రతిభావంతులను ప్రోత్సహిస్తామని, సినిమా రంగంలోనే కాకుండా, క్రీడలు, సైన్స్ రంగాల్లోనూ ఈ ఫౌండేషన్ సేవలు అందిస్తుందని వివరించారు. సుశాంత్ కు ఈ మూడు రంగాలంటే ఎంతో ఇష్టమని తెలిపారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ప్రపంచం తమకు ఓ గులాబీ వనం లాంటి దని, ఆ పూదోటలో సుశాంత్ ఓ అందమైన గులాబీ అని, కల్మషం లేకుండా మాట్లాడేవాడని అన్నారు. కాగా, పాట్నాలోని నివాసాన్ని సుశాంత్ స్మారక ప్రదేశంగా ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు.