ఈ 20 కంపెనీలతో జాగ్రత్త... ఇవన్నీ చైనా ప్రభుత్వ కనుసన్నల్లో నడుస్తున్నాయి: అమెరికా
- జాబితా విడుదల చేసిన వైట్ హౌస్
- జాబితాలో హువావే టెక్నాలజీస్
- వీటితో చైనా రక్షణ శాఖ, సైన్యానికి సంబంధాలున్నాయన్న అమెరికా
అమెరికా, చైనా మధ్య వాణిజ్యపరమైన యుద్ధం ఎప్పటినుంచో నడుస్తోంది. ఇప్పటికే పలుమార్లు పరస్పర ఆంక్షలు విధించుకుని తమ వ్యాపార స్పర్ధను మరింత రాజేసుకున్నాయి. కరోనా నేపథ్యంలో ఇరుదేశాల మధ్య మరింత అంతరం పెరిగింది. ఈ క్రమంలో అమెరికా ఓ కీలక జాబితా విడుదల చేసింది. ఆ జాబితాలో 20 కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలన్నీ చైనా ప్రభుత్వ అజమాయిషీతో నడుస్తున్నాయని అమెరికా ఆరోపిస్తోంది. వీటిలో కొన్ని చైనా రక్షణ శాఖ, సైన్యం అదుపాజ్ఞల్లో కొనసాగుతున్నాయని వివరించింది. ఏదో ఒక రూపంలో ఈ 20 కంపెనీలకు చైనా ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలున్నాయని అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్ పేర్కొంది.
అమెరికా విడుదల చేసిన జాబితా ఇదే...
అమెరికా విడుదల చేసిన జాబితా ఇదే...
- హువావే టెక్నాలజీస్
- ఏరో ఇంజిన్ కార్పొరేషన్ ఆఫ్ చైనా
- సీఆర్ఆర్ సీ కార్పొరేషన్
- చైనా మొబైల్ కమ్యూనికేషన్స్ గ్రూప్
- డానింగ్ ఇన్ఫర్మేషన్ ఇండస్ట్రీ కంపెనీ
- చైనా టెలీకమ్యూనికేషన్స్ కార్పొరేషన్
- చైనా జనరల్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్
- పాండా ఎలక్ట్రానిక్స్ గ్రూప్
- చైనా రైల్వే కన్ స్ట్రక్షన్ కార్పొరేషన్
- చైనా నేషనల్ న్యూక్లియర్ కార్పొరేషన్
- ఇన్ స్పర్ గ్రూప్
- హాంగ్జౌ హైవిజన్ డిజిటల్ టెక్నాలజీ కంపెనీ
- ఏవియేషన్ ఇండస్ట్రీ ఆఫ్ చైనా
- చైనా నార్త్ ఇండస్ట్రీస్ గ్రూప్ కార్పొరేషన్
- చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ కార్పొరేషన్
- చైనా షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ కార్పొరేషన్
- చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ ఇండస్ట్రీ కార్పొరేషన్
- చైనా సౌత్ ఇండస్ట్రీస్ గ్రూప్ కార్పొరేషన్
- చైనా ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ గ్రూప్ కార్పొరేషన్
- చైనా స్టేట్ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ కార్పొరేషన్