నంద్యాలలో కలకలం.. విషవాయువు లీకేజీ.. ఒకరి మృతి.. ప్రాణభయంతో కార్మికుల పరుగులు
- ఎస్పీవై ఆగ్రో కంపెనీలో ప్రమాదం
- అమ్మోనియా నుంచి సీవో2 తయారు చేసే గ్యాస్ లీక్
- ముగ్గురికి అస్వస్థత
- ఆందోళనలో స్థానికులు
విశాఖలో గ్యాస్ లీకేజీ ఘటన మరవకముందే కర్నూలు జిల్లాలో ఇటువంటి ఘటనే చోటు చేసుకుంది. నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో కంపెనీలో విషవాయువు లీక్ అయింది. అమ్మోనియా నుంచి సీవో2 తయారు చేసే గ్యాస్ లీక్ కావడంతో దాన్ని పీల్చిన ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనలో మరో ముగ్గురు అస్వస్థతకు గురికాగా వారిని ఆసుపత్రికి తరలించారు. విషవాయువు భయంతో కర్మాగారం నుంచి కార్మికులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. ఘటనాస్థలికి అంబులెన్సులు, ఫైర్, రెవెన్యూ సిబ్బంది చేరుకుని పరిస్థితులను పరిశీలిస్తున్నారు.
ఈ ఘటనతో స్థానికులంతా భయాందోళనలకు గురవుతున్నారు. గ్యాస్ లీకేజిని అదుపు చేయడానికి సిబ్బంది ప్రయత్నాలు జరుపుతున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.