వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజును 'ఆర్‌ఆర్‌ఆర్' అంటూ ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు

  • సినిమాను ప్రేమించే రాజమౌళి 'ఆర్‌ఆర్‌ఆర్' తీస్తున్నారు
  • అది ఎప్పుడు విడుదలై సినిమా థియేటర్లను కాపాడుతుందో
  • జగన్‌ను ప్రేమించే 'ఆర్‌ఆర్‌ఆర్' వైసీపీని కాపాడడానికి వచ్చారు
  • జగన్‌పై ఆయన స్వచ్ఛ‌మైన ప్రేమ కనబరుస్తారు 
కరోనా వ్యాప్తి నేపథ్యంలో సినీ పరిశ్రమలో చోటు చేసుకున్న పరిణామాలు, ఏపీ రాజకీయాల్లో కొనసాగుతోన్న పరిణామాలను పోల్చుతూ వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. వైసీపీ తనకు షోకాజ్‌ నోటీసులు ఇవ్వగా.. తనకు  సీఎం జగన్‌ మీద ఉన్న గౌరవంతో వాటికి సమాధానం ఇస్తానని ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రకటించిన విషయం తెలిసిందే.

జగన్‌కు తెలియకుండా ఎంపీ విజయసాయిరెడ్డి తనకు షోకాజు నోటీసు ఇచ్చారేమోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. వైసీపీలో నిజమైన స్వామిభక్తి ఉన్న నేతను తానేనని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ పరిణామాలపై వర్మ ట్వీట్ చేస్తూ... 'సినిమాను ప్రేమించే రాజమౌళి 'ఆర్‌ఆర్‌ఆర్' ఎప్పుడు విడుదలై సినిమా థియేటర్లను కాపాడుతుందో నాకు తెలియదు. కానీ, జగన్‌ను ప్రేమించే ఆర్‌ఆర్‌ఆర్‌ (రఘు రామకృష్ణం రాజు) వైఎస్సార్‌సీపీని కాపాడడానికి ఇప్పటికే వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది. అందుకే ఆయన జగన్‌పై స్వచ్ఛ‌మైన ప్రేమను కనబరుస్తారు' అని పేర్కొన్నారు.  


More Telugu News