కోటగుళ్ల గణపేశ్వరాలయంలో 10 అడుగుల భారీ సర్పం.. వణికిపోయిన అర్చకులు
- జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘటన
- శివలింగం వెనక చాలాసేపు అలాగే ఉండిపోయిన పాము
- పామును పట్టిన రిక్షా కార్మికుడు
తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురంలోని ఓ ఆలయంలో కనిపించిన భారీ సర్పం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. స్థానిక కోటగుళ్ల గణపేశ్వరాలయంలోని గర్భగుడిలో కనిపించిన దాదాపు 10 అడుగుల పొడవున్న పామును చూసిన అర్చకులు, భక్తులు భయంతో వణికిపోయారు. అలికిడికి అది వెళ్లిపోతుందని భావించినా శివలింగం వెనక అలాగే చాలాసేపు ఉండిపోయింది. చివరికి పాములు పట్టడంలో ఆరితేరిన రిక్షా కార్మికుడు రాజయ్య ఆలయానికి చేరుకుని పామును ఒడిసి పట్టుకున్నాడు. అనంతరం దానిని ఆలయానికి దూరంగా వదిలిపెట్టారు. ఈ పామును జెర్రిపోతు అంటారని, ఇది ఎవరికీ హాని తలపెట్టదని ఆయన తెలిపారు.